యంగ్‌టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తాజాగా ఓ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ తర్వాత త్రివిక్రమ్ సినిమాను పట్టాలెక్కించే ఆలోచనలో ఈ నందమూరి హీరో ఉన్నారు. అయితే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ లేటేస్ట్ అప్‌డేట్ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను తెరకెక్కించాలని త్రివిక్రమ్ భావిస్తున్నారట. దీనిలో భాగంగా ఈ చిత్రంలో ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్‌ను చిత్రబృందం సంప్రదించిందని టాక్. అంతేకాకుండా సంజయ్ దత్‌కు త్రివిక్రమ్ వీడియో కాలింగ్ చేసి స్టోరీ నెరేట్ చేసినట్లు సమాచారం. ఎన్టీఆర్ పాత్రకు సరిసమానంగా ఉండే పవర్ ఫుల్ పాత్ర కావడంతో సంజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్ చిత్రం.. పవర్‌ఫుల్ పొలిటీషియన్‌గా!